ప్రాంతీయం

మొదలులేదు మోక్షంలేదు ఆశపెట్టిన ప్రభుత్వాలు…

77 Views

ముస్తాబాద్,జూన్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): ఇంద్రమ్మ ఇల్లు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి.. గతప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకంమనిపెట్టి ఆపథకం పేరుమీద అర్హులైనవారికి డబుల్ బెడ్ రూమ్ లని ఓట్లకోసం సీట్లకోసమో ఆశచూపి మీదకోడి చూపి కిందచికెన్ కూర అన్నట్లుగా ప్రజలను నిరాశపరిచింది. గతప్రభుత్వం ఎలాగో మోసంచేసింది. ఈప్రభుత్వమైనా మీరిచ్చిన హామీ ప్రకారమే త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు చేపట్టాలన్నారు. నాడు అధికారంలోనికి రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకు కట్టిస్తామని హామీఇచ్చారు గనకే ఇల్లులేని పేదలకు వెంటనే వారికిచ్చిన హామీప్రకారం ఇంద్రమ్మఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని భారతీయ జనతాపార్టీ తరపున ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాధనరేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో ఆరులైన వారందరినీ కలుపుకొని వారికి న్యాయం జరిగేంతవరకు భారతీయ జనతాపార్టీ పక్షాన భారీఎత్తున ప్రధాన రహదారిపై ఉద్యమం చేయిస్తామని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7