గంభీరావుపేట్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ఈనెల 10న జరిగే బీసీ సింహ గర్జన విజయవంతం చేయాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునివ్వడం జరిగింది.
బీసీలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు 60 సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ రాజకీయ పార్టీ ప్రకటిస్తే అన్ని అగ్రకుల పార్టీలకు టులెట్ బోర్డ్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీలకు 60 టికెట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే బీసీ సింహ గర్జనలో రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా వెనకడుగు వేయమని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 5వేల విద్యార్థిని విద్యార్థులు తరలిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంభీరావుపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు పాపగారి పవన్ కళ్యాణ్ గౌడ్ మరియు నాయకులు సంకీర్త గౌడ్, నరేంద్ర ,సాయి కిరణ్, వివాంత్, అనీష్ తదితరులు పాల్గొన్నారు