ప్రకటనలు

మైనార్టీలు ఆరోగ్యశ్రీ, కేవైసీ సద్వినియోగం చేసుకోండి

119 Views

అర్హులైన మైనార్టీలు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు కేవైసీ చేసుకోవాలని సయ్యద్ షరీఫ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట లో మైనార్టీ ఉమ్మడి మండల యూత్ కమిటీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు కేవైసీ ఉచిత నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండల ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు షరీఫ్ మాట్లాడుతూ 65 మందికి ఆరోగ్యశ్రీ,కేవైసీ చేయించామని రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి సెంటర్ నిర్వాహకులు ఆదిత్య, ముస్లిం కమిటీ సభ్యులు రిజ్వాన్, రహీం, యామిన్ భాష, తాజ్,హలీం,రజాక్, దర్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *