రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా సిరిగాద రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని స్వర్ణకార సంఘ భవనంలో మండల స్వర్ణకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహ నిర్వహించగా ఎల్లారెడ్డిపేట స్వర్ణకార సంఘ అధ్యక్షుడు సిరిగాధ రమేష్ చారి ఉపాధ్యక్షులు కాడర్ల శంకర్ చారి, సిరిగాద సంతోష్ చారి, శ్రీపాద లింగమూర్తి చారి, దుంపెన ప్రభాకర్ చారి, శ్రీరామోజు రవి చారి, ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి గోపాల్ చారి, సహ కార్యదర్శి శ్రీరామోజు శేఖర్ చారి, కోశాధికారి శ్రీ గాద శ్రీనివాస్ చారి, సహా కోశాధికారి సిరిపాద కిషన్ చారి, ప్రచార కార్యదర్శి శ్రీరామోజు దేవరాజు చారి, ముఖ్య సలహాదారులు శ్రీరామోజు సత్యనారాయణ చారి, శ్రీ గాద అశోక్ చారి, మండల గౌరవ అధ్యక్షులు సిరిగాద కేశవులు చారి, సిరి గాద రామచంద్రం చారి లను మండల స్వర్ణకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మండల స్వర్ణకార సమస్యలను పరిష్కరించే దశలో నడుస్తామని, స్వర్ణకారుల అభివృద్ధికై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంఘ సభ్యులను అభివృద్ధి బాటలు నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మండోజు రాజేశం, ఎల్లారెడ్డిపేట పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పాలోజు సతీష్, శ్రీరామోజి కృష్ణ,పాలోజు సంతోష్, ఎర్రోజు బాలా చారి, సిరిగాద రాము, కడారుల భాస్కర్, శ్రీనివాస్త తదితరులు పాల్గొన్నారు.
