పేదవాడి కడుపు కొట్టి కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్న ప్రభుత్వం.
_ బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు .
_ అధికార పార్టీల నేతలకే దక్కుతున్న పధకాలు.
– కె.సి.ఆర్ ది నియంత పాలన .
– ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన మాజీ ఎం.పి. పొన్నం ప్రభాకర్.
, సెప్టెంబర్ 04 అక్కన్నపేట మండలం,
కాంట్రాక్టర్ల పేరుతో బడుగు బలహిన వర్గాల ప్రజల కడుపు కొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత మాజీ ఎం. పి. పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం పై ద్వజమెత్తారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రం బడా పారిశ్రామిక వేత్తల చెతుల్లోకి వెళ్ళి పోయి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించిన ఘనత కె.సి. ఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ప్రభుతాన్ని విమర్శించారు. అక్కన్నపేట మండల కేంద్రము లోని చౌటపల్లి గ్రామంలో నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యమములో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ నియంత రాజుల కాలంలో జరిగిన పాలన లెక్క ఉందని, పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ పధకాలు అందకుండా అధికార పార్టీ నేతలు అడ్డు పడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయె ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేడం లింగమూర్తి, సింగిల్ విండో ఛైర్మన్ బోలిశెట్టి శివయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
