*6న కాంగ్రెస్ గూటికి తుమ్మల…*
*మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 6న దిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సమక్షంలో.. తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 7 నుంచి రాహుల్.. యూరప్ పర్యటనకు వెళ్తుండటంతో ఈలోపే ఆయనను పార్టీలో చేర్చుకునేలా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏర్పాట్లు చకచకా చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ దిగ్గజంగా ఉన్న తుమ్మల.. కాంగ్రెస్‌లో చేరిక ఖాయం కావడంతో.. ఇప్పుడు ఆయనతో వెళ్లేవారెవరన్న ప్రచారం జోరందుకుంటోంది..*
