రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోశనివారం బాబాసాహెబ్ పేరును సచివాలయంకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షదాయకం
బాబాసాహెబ్ పేరు నిర్ణయం దేశానికే ఆదర్శం
పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
బాబాసాహెబ్ పేరు నిర్ణయం వలన ఘనంగా సంబరాలు
*తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్లజిల్లాఅధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ
తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును నిర్ణయించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణమాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ.. దేశంలో నేమొట్టమొదటిసారిగా అసెంబ్లీ తీర్మానం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పార్లమెంటు భవనానికి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేక పంపడమే కాక తెలంగాణ నూతనస చివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టాల నినిర్ణయింbచడాన్ని తెలంగాణమాల మహానాడు హర్షం వ్యక్తం చేస్తుందనిఅన్నారు. ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సముచిత గౌరవందక్కిందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచి ఉండకపోతే తెలంగాణరాష్ట్రమే ఏర్పాటు అయ్యేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంకెసిఆర్ నాయకత్వంలో అంబేద్కర్ ఆలోచనవిధానంతో పనిచేయడం చాలాసంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మిగతా రాష్ట్రముఖ్యమంత్రిలు కేసీఆర్ బాటలో నడిచి అసెంబ్లీలో పార్లమెంట్ భవనాని కి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసి పంపాలన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని పరిగణలకు తీసుకొని వెంటనే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా నాయకులు దోసల ఉపేంద్ర గాదం బాల నర్స దోసలప్రేమ్ కుమార్ మద్దెల బాలరాజ్ ఎర్రోళ్లసృజన్ తదితరు లుపాల్గొన్నారు.
