– ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి
దౌల్తాబాద్: క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, సోషల్ మీడియా ప్రభావం, మహిళల చట్టాలు, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ జనార్ధన్, ఎంపీటీసీ లక్ష్మీనరసవ్వ, కళాబృందం సిబ్బంది బాల నర్స్, రాజు, రవీందర్, తిరుమల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…..