మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి.
ఈసెట్ 2025 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బెల్లంపల్లి విద్యార్థిని అక్షయ.
బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అక్షయ ఈసెట్ 2025 ఫలితాల్లో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట ర్యాంక్ సాధించింది. పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, రామయ్య పల్లెకు చెందిన అక్షయ బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా చదువుతుంది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా ఉందని అక్షయ పేర్కొంది. తన విజయానికి అధ్యాపకులు మరియు తల్లిదండ్రుల ప్రోత్సహం చాలా ఉందని అక్షయ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
