ఆదివాసీల వేగు చుక్క దబ్బకట్ల నర్సింగరావు
టీడబ్ల్యూటీయు రాష్ట్ర అధ్యక్షుడు పొదేం కృష్ణప్రసాద్
ములుగు,సెప్టెంబర్ 03
ములుగు జిల్లా కేంద్రంలో తుడుం దెబ్బ రథ సారథి దబ్బకట్ల నర్సింగరావు 3వ వర్ధంతి యాది సభను ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ అధ్యక్షత వహించగా టీడబ్ల్యూటీయు రాష్ట్ర అధ్య క్షులు పొదేం కృష్ణప్రసాద్ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ముఖ్య అతి థిగా హాజరైనారు.దేశంలో కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలు గడిసిన ఆదివాసీల జీవన విధానానలను పాల కులు ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవటం విద్య ఉద్యోగ రాజకీయ ఉపాధి రంగాలలో ఆడివాసీలకు జరిగే అన్యాయాలను జీర్ణించుకోలేక పోయిన దబ్బకట్ల నర్సింగరావు ఆదివాసీల పక్షాన ప్రభుత్వ పాలకుల మీద పోరాటానికి 1996 ఆగస్ట్ 6తేదీ రాష్ట్రంలోని 30 తెగలను కలుపుకొని నాడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.1995 స్థానిక సంస్థల ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల సహకా రాన్ని అందిపుచ్చుకుని నాటి వరంగల్ ఇప్పటి ములుగు జిల్లాలోని ములుగు మండలం లోని రాయినిగూడెం ఎంపీటీసీ గా పోటీ చేసి గెలిసి ఇనాని మాస్ గా ములుగు ఎంఎంపి గా ఎన్నికయ్యారని తుడుం దెబ్బ సంఘన్ని స్థాపించి ఆది వాసీల హక్కులు చట్టాలు రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతంలో అన్యాక్రాంతం అవుతున్న భూముల గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుడుందెబ్బ వ్యవస్థాపకునిగా కార్యాచరణ చేసి ఆదివాసీల గొంతు రాష్ట్ర వ్యాప్తంగా విని పిస్తూ ప్రభుత్వాలకు దీటైన ప్రతిపక్ష పాత్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘం పోషించింది అన్నది వాస్తవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దబ్బకట్ల నర్సింగరావు ఆది వాసీల వేగుచుక్కగా ఆయన సంతాప (3)వ యాది సభగా జరుపుకుంటూ అన్నారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ,ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి గౌడ్, ములుగు జిల్లా కళాబృంద్దం అధ్యక్ష సబ్యులు రేలా విజయ్, రహిముద్దీన్,వవిలాల రాంబాబు,వెంకట్రామ్ నల్లమల సినిమా దర్శకులు రవి చరణ్, దళిత శక్తి పార్టీ నాయకులు కరుణ కరుణ్,రణ ప్రతాప్, యాకన్న,దళిత శక్తి పోగ్రాం నాయకులు సాగర్, పాల్గొన్నారు.