సిరిసిల్ల పట్టణంలోని బి.వై. నగర్ కు చెందిన పడిగె సతీష్ అనే యువకుడు ఆదివారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని (మార్కెట్ పల్లె) బల్యాల నగర్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడడానికి వెళ్ళిన సందర్భంగా వర్షం రావటంతో పక్కనే చెట్టు కింద నిలబడి ఉండగా ప్రమాదవశాత్తు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మృతుడు సతీష్ బైక్ మెకానిక్ గా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
మృతుడికి భార్య మధుప్రియ 10 నెలల కొడుకు లు ఉన్నందున ప్రభుత్వం వారి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించి మృతుని భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించి వారి కుటుంబాన్ని ఆదుకోగలరని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.