ప్రాంతీయం రాజకీయం

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి*

123 Views

 

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి* *వచ్చే ఎన్నికల్లో ఢంకా మోగించి అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కెసిఆర్ కి కానుకగా ఇవ్వాలి* *సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసిఆర్ ది* *ప్రైవేటీకరణ నుంచి తప్పించి సింగరేణి సీఎం కెసిఆర్ కాపాడారు* *సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశంలో కల్వకుంట్ల కవిత* హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివారం నాడు హైదరాబాదులో కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ తప్పించారని తెలిపారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి ఆ సంస్థను కాపాడారని చెప్పారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తేల్చి చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కెసిఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని, అప్పట్లో కేవలం 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు. కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం కేసీఆర్ వారసత్వం ఉద్యోగాలను కల్పించారని చెప్పారు. అదే రకంగా సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. తాను కూడా చొరువ తీసుకొని సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని అన్నారు. అవసరమైతే సింగరేణి కార్మిక నాయకులతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *