సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 5
24/7 తెలుగు న్యూస్
చారణ కోడికి బారాన మసాలా అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంకు చెక్కును చూసి ముక్కున వేలేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మెట్టకు చెందిన రాజవరం రాజశేఖర్ కు రెండు రోజుల కిందట స్పీడ్ పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. బుధవారం బ్యాంకు వాళ్ళు చెక్కు అందించగా అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ నుంచి అకౌంట్ పే ద్వారా 60 పైసల చెక్కు రావడంతో రాజశేఖర్ అవక్కయ్యాడు.





