–తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతి
కొద్ది రోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో దళిత యువకులు దొంగతనం చేశారనే నేపంతో చిత్రవధలు చేస్తూ,తీవ్రంగా కొట్టిన వ్యక్తులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి డిమాండ్ చేశారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమర్రి పట్టణానికి చెందిన చాకలి రాములు తన యొక్క మేకను దొంగలించరని అనే నేపంతో దళిత యువకులైన తేజ, కిరణ్ ను కాళ్లు చేతులు కట్టేసి,తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టి చిత్రవదలు చేస్తూ నరకం చూపిన రాములు, అతని భార్య, కుమారుడి ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఇట్టి అవమానాన్ని భరించలేక అదృశ్యమైన కిరణ్ కు ఏమైనా అపాయం జరుగుతే పూర్తి బాధ్యత చాకలి రాములు కుటుంబమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఇలాగే దళితులపై దాడులు చేస్తే వారిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు..




