గుండెపోటుతో ఓ దినసరి కూలీ శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆవునురి శివ (32) అనే వ్యక్తి ఓ రైస్ మిల్లులో దినసరి కూలీగా పనిచేస్తుండేవాడు.అయితే శనివారం యధావిధిగా కూలీ పనికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకొని భోజనం చేసి పడుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని నిద్ర లేపే ప్రయత్నం చేయగా లేవకపోవడంతో ఓ వైద్యుడిని పిలిపించి పరీక్షించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపాడు.సమాచారం అందుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.తునికి భార్య శ్రావణి, ఏడు సంవత్సరాల కుమారుడు ప్రణీత్ లు ఉన్నారు.
