రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘ సభ్యులు శనివారం రోజున సమావేశం ఏర్పాటు చేసుకొనీ గౌడ సంఘ కార్యవర్గ సభ్యులను గౌడ సంఘ అధ్యక్షులు పరకాల అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులు లింగంపెల్లి దేవయ్య, ప్రధాన కార్యదర్శి కొమిరె ఎల్లం, కోశాధికారి కోలశ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఇడుగురాల దేవయ్య, కార్యవర్గ సభ్యులు ముస్తాబాద్ లక్ష్మీపతి గౌడ్,కొమిరె పర్శరాములు, కొత్త పర్శరాములు, ఇడుగురాల అంజయ్య,లను గౌడ కుటుంబ సభ్యులు వివిధ హోదాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గం సభ్యులకు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.