ఈరోజు స్థానిక చంద్రంపేట లో హార్మోన్ గాస్పల్ మినిస్ట్రీస్ చర్చ్ ఫాదర్ బ్రదర్ ఏసుదాస్ గారి మరియు బి వై నగర్ రిజరక్షన్ లైఫ్ మినిస్ట్రీస్ బేతేస్థ బాప్టిస్ట్ చర్చ్ ఫాదర్ బ్రదర్ శ్యామ్ కల్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన క్రిస్టమస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకోండ అరుణ రాఘవ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ గౌరవ అతిథులుగా మాజీ ఎంపీటీసీ సూర దేవరాజు హాజరైనారు..
ఈ సందర్భంగా *గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ముందుగా వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సబండవర్గాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా క్రైస్తవుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు అందులో భాగంగా క్రిస్టమస్ సందర్భంగా కానుకలు అందజేయడం క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేయడం మరియు విద్యా అవకాశాలను కల్పించడం యువతకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కై లోన్ లు ఇవ్వడం మరియు వంటి ఎన్నో పథకాల ద్వారా వారి సేవలను అందించారు అన్నారు.
దాని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఈ సంవత్సరం కూడ క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరీ సోదరీమణులకు ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాల కానుకను విందును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు..
మన శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూనే క్రిస్టియన్లకు కూడ తన పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయ సహకారాలను అర్హులైన క్రిస్టియన్ ల అందరికీ అందించేలా కృషి చేశారని అన్నారు..
ఆ యేసు మనకు చూపించిన శాంతి, సత్యం, ప్రేమ, దయ, కరుణ, సేవ మొదలగు మంచి మార్గాల ద్వారా మానవ జీవితం ఉన్నత ప్రమాణాలతో సాగించాలని అన్నారు..
ఈ కార్యక్రమంలలో క్రైస్తవ సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
