*వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి*
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మేదిని రామలింగ రెడ్డి అన్నారు శనివారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న వైయస్సార్ విగ్రహానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు వైయస్సార్ ను మరువరు అని నిరుపేదల ఆశాజ్యోతి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి వారిని స్మరించుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు, ములుగు మండల అధ్యక్షుడు గామిడి నరేందర్ రెడ్డి, గజ్వేల్ మండల అధ్యక్షుడు ఎనకపల్లి ఐలయ్య. మైనారిటీ అధ్యక్షుడు కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు
