రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ కమిటీ నిర్వహించింది.
ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదల పాలిటి పెన్నిధిగా నిలవడం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందన్నారు.
అంతేకాకుండా అపర భగీరథునిగా రైతుబంధువునిగా పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సహాయం చేసే దిశగా ప్రభుత్వాన్ని నడపడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్ నాయకులు, చెన్ని బాబు గంట బుచ్చగౌడ్ కొత్తపల్లి దేవయ్య తిరుపతి గౌడ్ రాజేందర్ రామ్ రెడ్డి సంతోష్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి ఎండి ఇమామ్ కోనేటి పోచయ్య గుండ్ల శ్రీనివాస్ చెట్టుపెళ్లి బాలయ్య సిరిపురం నరేందర్ దొమ్మాట రాజు సిరిపురం మహేందర్ మామిండ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు