అర్హులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండి రానున్న ఎన్నికలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని,రాజన్న సిరిసిల్ల జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని తన ఛాంబర్ లో సెప్టెంబర్ 2, 3 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపు ఏర్పాటు పై ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఓటరు నమోదు కార్యక్రమం పకడ్బందీగా చేపట్టామని,అర్హులందరికీ ఓటు హక్కు కల్పించుటకు సహకరించి పక్కా ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు,ఎన్ జి ఓ లు, యువత తోడ్పడాలని అన్నారు.
