రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో సోమవారం జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాల యందు జాతీయ ఉపాధ్యాయదినోత్సవ సందర్భంగా విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన పాఠశాల ఉపాధ్యాయులను ఎస్ఎంసి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ఎస్ఎంసి చేర్మెన్ సిరిగిరి చంద్రమౌళి, టిఆర్ఎస్ లీడర్ వేణు, ఉపాధ్యాయులు అస్ర తబస్సం, తాడూరి సంపత్ కుమార్, గోల్కొండ శ్రీధర్ ,పాశం భాస్కర్, దాసరి శ్రీధర్, మరిపల్లి రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
