Breaking News

ఆయిల్ ఫామ్ కర్మగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి.

135 Views

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సెప్టెంబర్ 30 :సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ కర్మగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ:
తెలంగాణ రాకపోతే ఈరోజు సిద్దిపేట జిల్లాకి ఆయిల్ ఫామ్ కర్మాగారం వచ్చేదా.

ఈ ప్రాంత రైతులకు శుభదినం. 300 కోట్ల రూపాయలతో ప్రారంభించబోతున్న ఈ కర్మాగారం ఇక్కడి ప్రాంత రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చబోతుంది.

హరిత విప్లవ సృష్టికర్త డాక్టర్ స్వామినాథన్ అంత్యక్రియలకి ఈరోజు చెన్నైలో హాజరైనందుకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి రాలేకపోయారు. వారి తరఫున మనందరికీ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు.

ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం రైతులను మరింత చైతన్యపరిచే లక్ష్యాన్ని పెట్టుకుంది.

ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి ఆయిల్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో సాగుకు సంబంధించి ఒక డైరీ ప్రతి రైతుకు అందిస్తున్నారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి రైతులతో శిక్షణ కార్యక్రమాలు రైతుల తోటలోనే నిర్వహించాలి.

కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి కాలేశ్వరం కట్టుకున్నాం. 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. కానీ సాంప్రదాయ పంటల వల్ల రైతులు నష్టపోతున్నారు.

ఆయిల్ పామ్ సాగుబడి ప్రభుత్వ ఉద్యోగం లాగా నెలనెలా ఆదాయం.

రైతుకు లాభసాటిగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలోచన చేశారు.

ఒక సంవత్సరం లక్షా 56 వేల కోట్ల రూపాయల విలువైన మంచి నూనెను ఇతర దేశాల నుంచి తెలంగాణ దిగుమతి చేసుకుంటుంది.

ఒక మనిషి ఏడాదికి 19 కిలోల మంచి నూనెను వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు.

40 శాతం మాత్రమే మన భారతదేశంలో సాగవుతే 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

బ్రెజిల్ నుంచో మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో మంచి నూనె వస్తే తప్ప మన దగ్గర వంట చేసుకుని పరిస్థితి లేదు.

మనల్ని పరిపాలించిన పాలకులకు దూరదృష్టి, ముందుచూపు లేక దేశం ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది.

దేశంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతే తప్ప ఈ పరిస్థితిని అధిగమించలేము.

కాబట్టి 20 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ తోటలు వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.

ఆయిల్ పామ్ తో పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు.

ఆయిల్ పామ్ సాగు అన్నదాతలకు అభయహస్తం.

రైతులందరూ పెద్ద ఎత్తున సాగు చేయాలని కోరుకుంటున్నాం.

ఇగ కొందరు అంటారు తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని.

తెలంగాణ వచ్చింది కాబట్టే కాలేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం కాలేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాము కాబట్టి గాలిలో తేమశాతం పెరిగి ఈరోజు ఇక్కడ పామాయిల్ సాగు చేయగలుగుతున్నాం.

చుట్టూ రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, పోచమ్మ రిజర్వాయర్, చెక్ డ్యాములు, చెరువులు నిండుగా ఉండడం వల్ల ఇది సాధ్యం అయింది.

జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇచ్చి రైతులను ఆత్మహత్యలపాలు చేశారు గత పాలకులు.

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల గౌరవం పెంచిండు రైతుల ఆదాయం పెంచిండు రైతుల భూమి విలువ కూడా పెరిగేలా చేశారు.

ఉమ్మడి పరిపాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలోనే అత్యధిక భూమి రేట్లు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేయడం మంచి విషయం కాదు.

ఇంత అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు కనబడదు.

సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు తెలంగాణలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరంట్ అని ఉత్త కరెంటుగా మార్చారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో గాలిలో దీపం లాగా కరెంటు ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు కడుపునిండా కరెంటు ఇచ్చిండు.

రాష్ట్రంలో 24 లక్షల పంప్ సెట్లు నడుస్తున్నాయి. కరెంటు కోసం పైరవీల్లేవు పంచాయితీలు లెవు.

దేశంలో కాంగ్రెస్ బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారా చెప్పండి.

రైతులకు ఉచిత కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు.

కరెంటు లేక నీళ్లు లేక తెలంగాణలో ఏ మూలకైనా ఒక గుంటనైనా ఎండిందా చూపీయండి.

గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో రాజశేఖర్ రెడ్డి పాలనలో తీవ్రమైన కరువు ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ళ పాలనలో కరువు లేదు.

దేవుని నమ్మి యాగాలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అందుకే తెలంగాణలో 9 సంవత్సరాలు కరువు రాలేదు. పుష్కలంగా వర్షాలు కడుపునిండా నీళ్లు రైతులకు ఉన్నాయి.

వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ నాయకులు కావాలా మూడు పంటలకు 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా.

ఆత్మహత్యలు లేకుండా రైతులు ఆత్మవిశ్వాసంతో బ్రతికేలా చేసింది కేసీఆర్.

ఈ కర్మాగారంలో గంటకు 120 మెట్రిక్ పనుల ఫ్రూట్స్ను ప్రెస్సింగ్ చేసే కెపాసిటీతో లేట్ అయినా లేటెస్ట్ గా నిర్మించుకోబోతున్నాం.

ఆయిల్ ఫామ్ తో ప్రెస్సింగ్ చేసినంక మిగిలిన పొట్టుని కోళ్లకు, పశువులకు దాణాగా తయారు చేసే కర్మాగారం కూడా అంతర్భాగంగా నిర్మించబోతున్నాం.

మిగిలిన పిప్పితో కరెంటు తయారు చేసే కేంద్రాన్ని కూడా నిర్మించబోతున్నాం.

రీసైకిల్ చేసే వ్యవస్థతో జీరో వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రీసైకిల్ చేసుకొని ప్రతి చుక్కను తిరిగి ఉపయోగించుకునే విధంగా టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నాం.

ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి, ఆయిల్ ఫెడ్ సంస్థకు మా రైతుల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *