రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ సెల్ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సీఈఐ యాప్ ద్వారా గుర్తించి ఆమెకు అప్పగించడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. మండలంలో కెసిఆర్ కాలనీకి చెందిన చెన్ని రేణు రేణుక గోపి అనే దంపతులు తన సెల్ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిఇఐ నెంబర్ను సిఇఐఆర్ యాప్ ద్వారా గుర్తించి శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆమెకు అప్పగించడం జరిగిందన్నారు. అలాగే ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్టు అయితే వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి మీ సెల్ ఫోన్ యొక్క ఐఎంఈ నెంబరు తో దరఖాస్తు ఇచ్చినట్లయితే వెంటనే మీ ఫోన్ను అతి త్వరలో గుర్తించి మీకు అందించడం జరుగుతుందని ఎస్ఐ అన్నారు.
