నేరాలు

ప్రజలు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి రామగుండం పోలీస్ కమిషనరేట్

231 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

ప్రజలు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి

సమస్యత్మక ప్రాంతాలలో పటిష్టమైన భద్రత

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జైపూర్ ఏసీపీ మోహన్ అన్నారు.

చెన్నూర్ రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా జైపూర్ ఏసీపీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రజలు తమ ఓటు వేయాలన్నారు.

పోలింగ్ రోజున సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు. తెలిపారు. కవాతులో చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, చెన్నూర్ టైన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, కోటపల్లి ఎస్ఐ సురేష్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, భీమారం ఎస్ఐ రాజవర్ధన్, టి ఎస్ ఎస్ పి సిబ్బంది, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *