ప్రతిష్టాత్మక ఆహ్వానం
———————
ప్రతిష్టాత్మక Unaited States(US) Consulate హైదరాబాద్ శాఖ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే)కు సముచిత గౌరవాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ, తమ గుర్తింపులో ఉన్న 20 నుండి 30 ప్రముఖ సంస్థల బాధ్యులతో అప్పుడప్పుడు
US Consulate Get-to-Gather కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఇవ్వాళ నానక్ రాం గూడలోని షెర్టన్ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించింది. మీడియా రంగం నుండి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీని ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా US Consulate ప్రజా వ్యవహారాల అధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అలెగ్జాండర్ లారెన్, ప్రజా దౌత్య అధికారినిగా బాధ్యతలు చేపట్టిన లిన్ కుంక్లేల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు 30 మంది హాజరయ్యారు.
