Breaking News

తెలంగాణలో బిజెపి ఎక్కడా లేదు

113 Views

తెలంగాణలో బిజెపి ఎక్కడా లేదు

*బీఆర్ఎస్ గెలుపు ఖాయం.. ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్*

*జగిత్యాలకు జీవన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు*

*జగిత్యాల కార్యకర్తల సమావేశంలో కల్వకుంట్ల కవిత*

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదని, మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన జగిత్యాల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే సంజయ్ అన్న నినాదాలు స్ఫూర్తితో పని చేయాలని కోరారు. జగిత్యాల అడ్డపై బీఆర్ఎస్ జండా ఎగరడం గత ఎన్నికల్లో చాలా సంతోషం అనిపించింది అని తెలిపారు. కరోనా సమయంలో విశేష సేవలో అందించిన ఎమ్మెల్యే సంజయ్ నీ అభినందించారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తప్పకుండా మరోసారి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారని అన్నారు.

ఎమ్మెల్సీ రమణ సమన్వయంతో మనం అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నామని తెలిపారు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ల గురించి ఆలోచించవద్దు స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం లో కేవలం కాంగ్రెస్తోనే తమ పార్టీకి పోటీ అని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి చేసింది ఏమీ లేదని విమర్శించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *