Breaking News

రామరాజు నైపుణ్యం వెలకట్టలేనిది* *గజ్వేల్ కు వన్నెతీస్తున్న రామకోటి* *ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి*

138 Views

 

 

చక్కటి చిత్రకారుడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన రామకోటి రామరాజు నైపుణ్యం వెలకట్టలేనిదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. బుదవారం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు 25 కేజీల ఆవాలతో వేసిన సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతున్న రామకోటి రామరాజు తన సేవలు , ఆధ్యాత్మిక భావన, చిత్రకళా నైపుణ్యంతో గజ్వేల్ కు వన్నెతీస్తున్నట్లు స్పష్టం చేశారు. వివిధ సందర్భాలలో దేవి దేవతల చిత్రాలు వేస్తూ అందరి మన్ననలు పొందుతున్న రామకోటి రామరాజు అభినందనీయుడని ప్రశంసించారు.

నాచారం ట్రస్ట్ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి మాట్లాడుతూ 5సార్లు కేసీఆర్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రంచడం అభినందనీయం. అందరికి అబ్బే కళ కాదు.అని రామకోటి రామరాజు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి స్కూల్ ప్రిన్సిపాల్ అంబాదాసు, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, రహీం, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు నవాజ్ మీరా, రాష్ట్ర నాయకులు ఖాజా విరసత్ అలి , ఏ ఎం సీ డైరెక్టర్ సయ్యద్ మతీన్, స్వామిచారి, సాధక్ పాషా తదితరులు పాల్గొన్నారు .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *