ఒక్కరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు…
కరీంనగర్ జిల్లా తిమ్మాపుర్ మండలంలోని తిమ్మాపూర్ స్టేజి వద్ద గురువారం వేకువ జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అట్ల పోచమల్లయ్య యాదవ్ (46) తిమ్మాపూర్ స్టేజి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు అతి వేగంగా వస్తున్న కారు పోచ మల్లయ్యను ఢీకొని స్తంభానికి ఢీ కొట్టి బోల్తా కొట్టింది. మల్లయ్య ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మొదటగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించిన అనంతరం మృతి చెందిన మల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.