–బిజెపి రాష్ట్ర ఈసీ మెంబర్ ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి.
గ్రామాల్లోని ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి ని కలిగించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ పార్టీ ఆదేశాలు,రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచనల మేరకు మేరా మాటి-మేరా దేశ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతీ గ్రామం నుండి మట్టి సేకరణ కార్యక్రమం శుక్రవారం బీజేపీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో పోరండ్ల గ్రామంలో ప్రారంభమయ్యింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన మేరా మాటి-మేరా దేశ్ కార్యక్రమాన్ని ప్రతీ గ్రామంలో జరిపి విజయవంతం చేయాలని కోరారు. పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరిని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.జాతీయ జెండా చేతబట్టుకొని గ్రామంలోని కొంతమంది ఇంటికి వెళ్లి కార్యక్రమాన్ని వివరించి కలశం లో మట్టిని సేకరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్,బీజేపీ నాయకులు చింతం శ్రీనివాస్,కామెర రవి,కందుకూరి విశ్వరూపం, మాడిశెట్టి వెంకటేష్, సత్యనారాయణ,వెలుగు మధు పొన్నాల ఎల్లయ్య, తోడెంగ పర్శరాములు, బిజిలి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.