School games federation ఆధ్వర్యంలో మర్కుక్ మండల స్థాయి కోకో, కబడ్డీ అండర్ 17, అండర్14 మండల సెలక్షన్ క్రీడాపోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ లో జరిగాయి. ఈ పోటీల లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించడానికి ముఖ్య అతిథులుగా మర్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, మండల విద్యాధికారి ఉదయభాస్కర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని ఖో-ఖో ఆటను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ ఆటలలో గెలుపు ఓటమి సహజమని , శారీరిక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఈ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి ఉపాధ్యాయులు శ్రీనివాసరావు రమణారావు స్థానిక పాఠశాల పి ఈ టి రజని, పాములపర్తి పి ఈ టి భవిత, కస్తూర్బా పి ఈ టి సరిత స్థానిక పాఠశాల విద్యార్థులు, కస్తూర్బాపాఠశాల విద్యార్థినిలు శివార్ వెంకటాపూర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.





