సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో సోమవారం సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొని జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ గోలి నరేందర్ తో కలిసి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జననమే కానీ మరణం లేని ఒక వీరుడు భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన వారిలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు.ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్ , ఉప సర్పంచ్ పుట్ట మహేష్, వార్డ్ మెంబర్లు, టీచర్ రామకృష్ణ రెడ్డి, చిన్ని కృష్ణ, నాయకులు పాములపర్తి కరుణాకర్, సుధాకర్,రామరాజు,హరికృష్ణ,బాలరాజు,నర్సింలు,నాగరాజు,స్వామి,తిరుపతి, మధు, యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు