మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి. జె. పి నేత.
జె.యస్.ఆర్
సెప్టెంబర్ 02.
అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన యామ సాయి చందు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా కుటుంబాన్ని శనివారం రోజున బి. జె. పి. రాష్ట్ర కార్గవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు. చిన్న వయస్సులోనే ఎదుగుతున్న కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా ఆయన మనోదైర్యం కొల్పొవద్దని పార్టీ తరపున కాని , తన ద్వారా కాని ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని ఆ కుటుంబానికి ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బి. జె.పి. అసెంబ్లి కన్వినర్ జనగామ వేణు గోపాల్ రావ్ , విద్యార్థి సంఘం నాయకులు బాస్కర్ నాయక్, బూత్ అధ్యక్షులు గంటల రాము తదితరులు పాల్గొన్నారు.
