– రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ లు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామల సర్పంచులు గురువారం కరీంనగర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి…
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గుండ్లపల్లి సర్పంచ్ బేతేల్లి సమత- రాజేందర్ రెడ్డి , గునుకుల కొండాపూర్ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి- బాలరాజు, గుండ్లపల్లి ఉపసర్పంచ్ చింతల పద్మ పర్శరాము, బీఆర్ఎస్ నాయకులు వంగల సత్యనారాయణ రెడ్డి,వంగల రవీందర్ రెడ్డి,వంగల నర్సింహా రెడ్డి,వడ్డె హన్మంత రెడ్డి, వంగల లక్ష్మారెడ్డి, కొమ్మెర ప్రశాంత్ రెడ్డి,జాప అశోక్ రెడ్డి, తదితరులు వున్నారు…