ప్రాంతీయం

జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

210 Views

జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి

ములుగు ప్రతినిధి,ఆగస్టు 31

తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి శుభాకాంక్షలు తెలిపారు.రాకీ పౌర్ణమి సందర్భంగా ఆమె తన స్వగృహంలో పార్టీ శ్రేణులకు,సిబ్బందికి, కుటుంబ సభ్యులతో కులమతాలకు అతీతంగా రాకీ పండుగ జరుపుకున్నారు.కుటుంబ బంధాలు,రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సం బంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుం దన్నారు.తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు,అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు,రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందన్నారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని ఆమె పేర్కొన్నారు.మానవ సంబంధాలను,కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యా చరణ కొనసాగుతు న్నదని ఆమె స్పష్టం చేశారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసాను అందిస్తున్నా యన్నారు.సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృ ద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ,సహోదర భావాన్ని పెంచుతున్నదని అన్నారు.అనేక పథకాలను అమలు చేస్తూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానం దిస్తూ,పెద్దన్నలా రక్షణగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు.రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపు కోవాలని జిల్లా ప్రజలకు జడ్పీ చైర్ పర్సన్ పిలుపునిచ్చారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *