జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం
– అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ హరి, ఎంపీటీసీ అనసూయ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, చెన్నిబాబు బం
డారి బాల్రెడ్డి, పందిరిల్ల శ్రీనివాస్ గౌడ్, గుర్రపు రాములు, ఎండి రఫీక్ తదితరులు పాల్గొని గన్న శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీటర్ కు జీరో కరెంట్ బిల్ కొట్టి ప్రారంభించారు. విద్యుత్ వినియోగదారులు ఇంటి యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.
