ప్రాంతీయం

మీ రక్షణయే – పోలీస్ బాధ్యత

96 Views

ఎల్లప్పుడూ మేము మీకు అండగా ఉంటాం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రక్షాబంధన్ సందర్భంగా జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో బద్దెనపల్లి లో సోషల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళ రక్షణ పోలీస్ బాధ్యత కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

*రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థినులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ అధికారులకు రాఖీలు కట్టడం జరిగింది.*

అనంతరం జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ…మాది ఉమ్మడి కుటుంబం అని నాకు తొమ్మిది మంది అక్కచెల్లెళ్లు రాఖీ పండుగ సందర్భంగా నాకు రాఖీ కట్టడానికి ఈ రోజు నా దగ్గర ఎవరు లేరు నా అక్కచెల్లెళ్ల స్థానంలో మీరు అందరూ నాకు రాఖీ కట్టాలని నేను మీకు రక్షగా ఉంటానని అన్నారు.జిల్లాలో మహిళల రక్షణకు అనేక కార్యక్రమాలు నిరహిస్తున్నాం అని అందులో భాగంగా ఆపరేషన్ జ్వాలా కార్యక్రమంతో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.బస్ లలో మహిళల రక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.విద్యార్థినిలు మహిళలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని,నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నాప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని అన్నారు.చదివే విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా విద్యకు దగ్గరగా ఉండి తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని,మహిళలు,విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

వేధింపుల గురయ్యే మహిళలు,విద్యార్థినిలు వెంటనే డయల్100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.

విద్యార్థినిలకు,పాఠశాల ,కళాశాల విద్య చాలా ముఖ్యమైనదని ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని ప్రతి ఒక్క ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడి అమ్మానాన్నలకు, మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకరవలన్నారు.

ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ సధన్ కుమార్, షీ టీమ్ ఎస్.ఐ అంజయ్య, ప్రమీల, షీ టీం సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *