మూసాపేట్ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం ప్రారంభం
అక్టోబర్ 27
కూకట్ పల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు ని ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మూసాపేట్ డివిజన్ లో మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదట జనతా నగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు.
కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు , కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో గల్లీ గల్లీలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావు ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ప్రాంతీయ భేదాలు చూపకుండా అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది అని, ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చి మాయమాటలు చెప్పే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని శ్రావణ్ కుమార్ ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్,డివిజన్ పరిశీలకులు నరేంద్ర ఆచార్య, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జిల్లా గోపాల్, సీనియర్ నాయకులు నపారి చంద్రశేఖర్, చెరుకు సత్యనారాయణ గౌడ్ బాబు రావు,తుకారాం, మీ ఇనుగంటి రాజు,నాని, రాము, ఈశ్వర్ ,జైరాజ్ , అరుణ్, నర్సింగ్, రమేష్, కుమార్ ,అర్జున్, శ్యామల ,సూర్యకళ,హరిత, రమాదేవి, పద్మ,శాంత ,ఉమ, అనురాధ,సంధ్య , శిరీష ,లత,అరుణ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
