గుండారం గురవయ్య సంఘం నూతన కార్యవరం ఎన్నిక
గుండారం గ్రామంలో నూతనంగా గురవయ్య సంఘం ఏర్పాటు చెయ్యడం జరిగింది.100 సం చరిత్ర గల గురవయ్య పేదలకు భూములు పంచిన చరిత్ర నైజాం కాలంలో అంతమైందని గుండారం పూర్వికులు తెలియజెయ్యడం జరుగుతుంది. గుండారం ప్రజలు కుల మాత వర్గ బేధాలు లేకుండా దాదాపు 100సంల నుండి గురవయ్య మైసమ్మకు పూజలు చెయ్యడం ఆనవాయితీ. ఈ రోజు ఊరి ప్రజల సమక్షంలో గురవయ్య సంఘం అధ్యక్షునిగా బోయిని బాలయ్య, ఉపాధ్యక్షునిగా భూక్యా శ్రీను రాథోడ్, క్యాషియర్ ఇందిరాల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ పూల్సింగ్, కార్యదర్శి నమిలికొండ చెంద్రయ్య,తదితరులు ఎన్నికైనారు ఎక్కకగ్రివంగా ఎన్నుకుందుకు 250 మంది సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. .
