ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి బియ్యం వితరణ.
గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రేసు మంజుల – భర్త క్రీశే, రేసు సత్తీష్ నిరుపేద కుటుంబానికి ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి నెల రోజులకు సరిపడే వంట సామాను మరియు 50 కిలోల బియ్యం వితరణ చేశారు
ఈకార్యక్రమంలో వార్డు మెంబర్ పందర్ల శ్రీనివాస్ గౌడ్, సందుపట్ల రాంరెడ్డి, పారిపల్లి రాంరెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి, కొత్త మల్లయ్య, బుర్కా ఎల్లం, కొత్త శ్రీను, జంగం దేవేందర్, రేసు రాజు, కొత్త అరుణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
