– దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు
దౌల్తాబాద్: వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో మళ్లీ బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ నాలుగవ వార్డు మెంబర్ రాజేశ్వరి గణేష్, మండల కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ గణేష్ లు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం తమదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అనిల్ రెడ్డి, కోనాపూర్ బిజెపి గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు….