ప్రాంతీయం

జైలు శిక్షతోపాటు 3,వేలురూ..జరిమానా…

155 Views
ముస్తాబాద్ మార్చి 7 (24/7న్యూస్): ప్రతినిధి రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.3000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు..12 జూన్ 2018న ఎల్లారెడ్డిపేటకు చెందిన మాలోతు తుకారాం తన స్నేహితుడు భూక్య శ్రీనివాస్ తో కలిసికారులో సిద్దిపేటకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో శ్రీనివాస్ కారు డ్రైవింగ్ చేస్తుండగా తుకారాం ప్రక్కన కూర్చున్నాడు. శ్రీనివాస్ కారుని అతివేగంగా నడపడంవలన  ముస్తాబాద్ మండలం బధనకల్ గ్రామంవద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తుకారాం తీవ్రంగా గాయపడ్డాడు. ఇట్టి సంఘటనపై ముస్తాబాద్ పోలీసులు శ్రీనివాస్ పై కేసునమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ శ్రవణ్ యాదవ్ మరియు కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించారు.
No Slide Found In Slider.

Poll not found