Breaking News

వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు

63 Views

వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు
(29 ఆగష్టు “తెలుగు భాషా దినోత్సవం” సందర్భంగా)

అందని దంపతుల వ్యావహారిక తెలుగు ద్రాక్ష పండును తియ్యగా మార్చి నోటికందించి, చిటారు కొమ్మన దాగిన వాడుక తెలుగు మిఠాయి పొట్లాన్ని సామాన్యుడి గొంతుకలో తెలుగు తేనెలు పోసిన “వాడుక భాషా ఉద్యమ పితామహుడి”గా పేరొందిన గిడుగు వెంకట రామమూర్తి 1863, 29 ఆగష్టు శ్రీకాకుళం జిల్లా జన్మించిన పర్వతాల పేట గ్రామంలో వీర్రాజు. పర్వతాలు పేట పాఠశాలలో ప్రాథమిక విద్యను, 1875లో తండ్రి అకాల మరణం తరువాత, మేనమామ సంరక్షణలో విజయనగరం మహారాజావారి ఆంగ్లాలయంలో 1879లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశాడు. అదే ఏడాది వివాహం చేసుకొన్న రామమూర్తి 1880లో ఉపాధ్యాయుడిగా రూ:30/- నెల జీతంతో పర్లకిమిడి రాజా స్కూల్లో ఉద్యోగపర్వం ప్రారంభించి తల్లి, ఇద్దరు సోదరీమణుల సంసార భారాన్ని నెత్తికెత్తుకున్నారు. ప్రైవేట్‌గా చదివి 1886లో ఎఫ్. ఏ. పూర్తి చేసి, 1894-96లో బి.ఏ. పట్టాను పొందారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, సంస్కృతం,

“సవర భాష”కు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి:
శ్రీకాకుళం సమీప అడవుల్లో నివసించే బడుగుల ‘సవర’ భాషను కూడా నేర్చుకొని సవర భాషలో పుస్తకాలు రాసి స్వంత వ్యయంతో విద్యాలయం నడపడంతో పాటు విద్యార్థులకు తమ ఇంటిలోనే బస‌ను ఏర్పాటు చేసి నడుపుతూ వారికి తమ సవర భాషలోనే విద్యాబోధన అందించిన మహానుభావుడిగా గిడుగు రామమూర్తి చరిత్రలో చెరగని ముద్రను వేస్తూ “దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌” అనే సూక్తిని ఆచరణలో నిరూపించారు. 1913లో గిడుగు వారి ప్రతిభను గుర్తించిన మద్రాసు ప్రభుత్వం “రావు బహదూర్‌” బిరుదును ప్రదానం చేశారు. భాషాశాస్త్రంలో వ్యాకరణ నిర్మాణ మెళుకువలు నేర్చుకొని 1931లో “సవర భాషా వ్యాకరణాన్ని”, 1936లో “సవర ఆంగ్ల నిఘంటువు”ను తీసుకురావడం, 1938లో దానిని మద్రాసు ప్రభుత్వం ముద్రించడం కూడా జరిగి పోయింది. 1934లో ప్రభుత్వం చేత ‘కైజర్‌-ఇ-హింద్‍’ బిరుదుతో పాటు స్వర్ణ పతకం చేత గౌరవింపబడ్డారు. గురు వృత్తిలో మూడు దశాబ్దాలు సేవలందించిన గిడుగు వారు 1911లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి “ఆధునిక తెలుగు భాషా సంస్కరణ’ వైపు దృష్టిని కేంద్రీకరించడం ప్రారంభించారు.

వ్యావహారిక భాషోద్యమం:
1907లో పాఠశాలలో తెలుగు భాష పండితులు చెప్పే పాఠాలు నచ్చని నాటి స్కూల్‌ ఇనిస్పెక్టర్‌ తెల్ల దొర జె. ఏ. యేట్స్‌ చొరవతో ప్రజలు సాధారణంగా వాడుకునే భాషను విద్యార్థులకు అందించాలనే ఆలోచనను ఆచరణలో పెట్టడానికి యేట్స్‌తో కలిసిన గురజాడ, గిడుగు, శ్రీనివాసయ్యర్‌ (ఏ వి ఎన్‌ కళాశాల ప్రధానాచార్యులు) అనబడే నలుగురు విజ్ఞులు కలిసి “వ్యావహారిక భాషోద్యమం” ప్రారంభించారు. యేట్స్‌ సహకారంతో “శిష్టజన వ్యావహారిక తెలుగు భాష”ను గ్రంథ రచనకు ఉపయోగించడంలో కృతకృత్యులయ్యారు. వీరేశలింగం పంతులు సాయం కూడా తీసుకుంటూ 1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచార నిమిత్తం “తెలుగు మాస పత్రిక”ను నడిపారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు, సాహితీ సమితి, నవ్య సాహితీ పరిషత్తు లాంటి సంస్థల సభల్లో తమ వాదాన్ని వినిపిస్తూ పండితుల మెప్పును పొందడమే కాకుండా ప్రముఖ పండితులను వ్యావహారిక భాషావాదం వైపు మరల్చగలిగారు. గ్రాంథిక భాష గ్రంథాల్లో మాత్రమే నిక్షిప్తం అవుతుందని, వ్యావహారిక భాష ప్రజల నాలుకల్లోంచి జాలువారుతూ నాట్యమాడుతుందని పలు మార్లు ప్రసంగించి మెప్పించారు.శిష్టజన వ్యావహారిక భాష మాత్రమే ప్రజల నాలుకల్లో వినబడుతుందని, అదే భాషలో పాఠ్య పుస్తకాలు ఉండాలని, తెలుగు భాష బోధనలు కూడా అదే భాషలో జరగాలని అభిప్రాయపడ్డారు. తెలుగు వాడుక భాషలో ‘ప్రతిభ’, ‘జనవాణి’ అనబడే పత్రికలను కూడా వెలువరించడం ప్రారంభించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు:
వాడుక భాషా ఉద్యమ పితామహుడు, బహుభాషా శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, చరిత్రకారుడు, భాషోద్యమ మూల పురుషుడు, సృజనశీలి, సాహిత్య శిఖరం, హేతువాదిగా పేరొందిన వాడుక భాష స్వాభిమాని మన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు మన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. 1919లో రాజమహేంద్ర వరంలో వీరేశలింగం అధ్యక్షుడిగా, తానే కార్యదర్శిగా ‘వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం’ స్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి ‘సప్తతి మహోత్సవం’ వేడుకను తన శిష్యులు, అభిమానులు, పండితులు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 46 పరిశోధన వ్యాసాలతో ‘వ్యాస సంగ్రహం’ అనబడే గ్రంథాన్ని వెలువరించారు. గిడుగు రామమూర్తి పంతులు ‘తెలుగు సరస్వతి నోముల పంట’ అని, ‘తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు -, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు’ అని కమ్మని పద్యం కూడా రచించడం వారి ప్రతిభకు గీటు రాయిగా నిలుస్తున్నాయి. ‘గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు’ అని ఖ్యాతి గాంచిన రామమూర్తి అచ్చ తెలుగు వెలుగుగా మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. నేడు మనమందరం తేట తెలుగు వాడుక భాషను వాడుతున్నామంటే అది గిడుగు వారు చేసిన కృషి ఫలితం మాత్రమే అని నమ్మాల్సిందే.
1938లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘కళాప్రపూర్ణ’ బిరుదును పొందిన గిడుగు వారు 22 జనవరి 1940న కన్ను మూశారు. గిడుగు రామమూర్తి తనయుడు గిడుగు సీతాపతి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌తో పాటు ‘కళాప్రపూర్ణ’ బిరుదును కూడా స్వంతం చేసుకోవడం అభినందనీయం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

image0.jpeg
[8/26, 4:58 AM] Srr Madusudam Reddy Ex Pri: అత్యధిక నీటి ఒత్తిడిలో 25 ప్రపంచ దేశాలు, 25 శాతం ప్రపంచ జనాభా

నీరే ప్రాణాధారం. భూగోళంపై 70 శాతం వరకు జలావరణమే ఉన్నది. భూగ్రహంపై ఉన్న నీటిలో 2-3 శాతం వరకు మాత్రమే మానవ వినియోగయోగ్యతను కలిగి ఉన్నది. ధరణిపై జల చక్రం దెబ్బతింటున్నది. నీటి కొరత విశ్వ మానవాళిని భయపెడుతున్నది. ప్రపంచ మానవాళి అతివృష్టి, అనావృష్టి విపత్తులతో సతమతమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మానవాళి తీవ్రమైన వాతావరణ ప్రతికూల మార్పుల దెబ్బకు విలవిల్లాడుతున్నారు. ఓ వైపు అకాల వర్ష వడగళ్లు, తీవ్రమైన వరదలు, మరో వైపు తీవ్ర వడగాలులు, కరువుకాటకాలు చుట్టు ముడుతున్నాయి. వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌ (డబ్ల్యూఆర్‌ఐ) రూపొందించిన “ఆక్వాడక్ట్‌ వాటర్‌ రిస్క్ అట్లాస్‌” గణాంకాల ప్రకారం ప్రపంచంలో 25 శాతం జనాభా కలిగిన 25 దేశాల్లో అతి తీవ్రమైన నీటి ఒత్తిడి (ఎక్స్‌ట్రీమ్లీ హై వాటర్‌ స్ట్రెస్‌) రానుందని అంచనా వేసింది. రానున్న రోజుల్లో 50 శాతం ప్రపంచ జనాభా, దాదాపు 4 బిలియన్లు, ప్రతి ఏట కనీసం ఒక మాసమైన అత్యధిక నీటి కొరతను అనుభవిస్తున్నట్లు వర్ణింపబడింది. తీవ్ర నీటి ఒత్తిడి సంక్షోభంతో సాధారణ జీవితాలు, ఉద్యోగ ఉపాధులు, ఆహార లభ్యత (వ్యవసాయ ఉత్పత్తులు), శక్తి భద్రత లాంటి ప్రతికూలతలు ఎదురు కానున్నట్లు హెచ్చరికలు చేస్తున్నారు. పంటలు, జంతు జాతి పరిరక్షణలు, విద్యుదుత్పత్తి, మానవాళి ఆరోగ్య రక్షణ, సమానత్వ సమాజ స్థాపన, పర్యావరణ సమతుల్యత లాంటివి నీటి లభ్యత మీద మాత్రమే ఆధారపడి ఉంటాయని మనకు తెలుసు. నీటి ఒత్తిడిని తగ్గించడానికి అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికయుక్తంగా నియంత్రించడం, వాడుకోవడం, భద్రపరుచుకోవడం, పొదుపుగా వాడుకోవడం, వృధాను అరికట్టడం లాంటివి అనివార్యంగా చేయాలి. నీటి లభ్యతతో ఆర్థిక ప్రగతి, వాతావరణ సానుకూల మార్పులు, జీవరాసుల ఆరోగ్య భాగ్యాలు వర్థిల్లుతాయి.
భూమండలంపై అందుబాటులో ఉన్న నీటి కన్న విచక్షణారహిత వినియోగం పెరుగుతున్నది. 1960లో నీటి వినియోగంతో పోల్చితే నేడు రెట్టింపు నీటి వినియోగం పెరగడం గమనించారు. జనాభా విస్పొటనం, వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ, పశు పోషణ, శక్తి ఉత్పత్తి, మ్యాన్యుఫాక్చరింగ్‌ రంగాల అభివృద్ధితో నీటి వాడకం విపరీతంగా పెరుగుతున్నది. నీటి నిల్వల మౌళిక వసతులకు పెట్టుబడులు తగ్గడం, సుస్థిరాభివృద్ధి కొరవడిన అస్పష్ట పాలసీల అమలు, వాతావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులు లాంటి అంశాలు నీటి ఎద్దడిని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. నీటి లభ్యతకు, నీటి వినియోగానికి మధ్య సమతుల్యత దెబ్బ తింటున్నది. లభ్యమైన నీటిలో 80 శాతం వాడితే ‘అతి తీవ్ర నీటి ఒత్తిడి (ఎక్స్‌ట్రీమ్‌ వాటర్‌ స్ట్రెస్‌) అని, 40 శాతం వరకు వినియోగిస్తే ‘అధిక నీటి ఒత్తిడి (హై వాటర్‌ స్ట్రెస్‌) అని నిర్ణయిస్తారు.

అత్యధిక నీటి ఒత్తిడి సంక్షోభ దేశాలు:
ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో అందుబాటులో ఉన్న నీటిలో వినియోగం 80 శాతం కన్న అధికంగా ఉన్నట్లు గమనించారు. అత్యధిక నీటి ఒత్తిడి కలిగిన దేశాల జాబితాలో యూకె, ఇండియా, ఇరాన్‌, మెక్సికో, సౌథీ అరేబియా, చిలీ, శాన్‌మెరినో, బెల్జియం, గ్రీస్‌ దక్షిణ ఆఫ్ర్రికాలు ముందున్నాయి. వీటికి తోడుగా అల్పాదాయ లేదా మధ్యాదాయ దేశాలైన బెహరెయిన్‌, సైప్రస్‌, కువైట్, లెబనాన్‌, ఓమన్‌, ఖతార్‌ లాంటి దేశాల్లో గృహ అవసరాలు, వ్యవసాయం, పరిశ్రమల వాడకానికి నీరు అధికంగా అవసరం కావడంతో కూడా ఆయా దేశాలు తీవ్ర నీటి కొరత అంచున విలవిల్లాడుతున్నాయి. మిడిల్‌ ఈస్ట్‌, నార్థ్‌ ఆఫ్రికా దేశాల్లో 83 శాతం జనాభా, దక్షిణ ఆసియా దేశాల్లో 74 శాతం జనాభా నీటి కొరత సమస్యతో బాధ పడుతున్నారు. 2050 నాటికి నీటి డిమాండ్‌ 25 శాతం వరకు పెరగవచ్చని, దీనితో అదనంగా ఒక బిలియన్‌ జనాభా నీటి ఒత్తిడి వలలో పడనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంత దేశాల్లో రానున్న ఏండ్లలో 100 శాతం జనాభా నీటి తీవ్ర కొరత కోరల్లో చిక్కనున్నారనే కఠిన వాస్తవం భయాన్ని కలిగిస్తున్నది. నీటి కొరత హద్దులు దాటితే ఆయా దేశాల్లో సామాజిక, రాజకీయ అశాంతి ప్రజా జ్వాలలు ఎగిసి పడతాయని కూడా గత ఇరాన్‌ చరిత్ర హెచ్చరిస్తున్నది. ఆఫ్రికన్‌ దేశాల్లో నీటి విచక్షణారహిత వాడకం, నీటి నియంత్రణలో లోపాల వల్ల తీవ్రాతితీవ్రమైన నీటి ఒత్తిడి కబలించనుందని హెచ్చరిస్తున్నారు.

నీటి ఒత్తిడి దుష్ప్రభావం:
తీవ్ర నీటి ఒత్తిడి కలిగిన దేశాల్లో ఆహార భద్రత కొరవడుతుంది. 2010లో నీటి ఒత్తిడి వల్ల జిడిపీలో 24 శాతం, దాదాపు 15 ట్రిలియన్‌ డాలర్ల నష్టం జరిగిందని, 2050 నాటికి జిడిపీలో 31 శాతం, దాదాపు 70 ట్రిలియన్‌ డాలర్ల నష్టం నీటి ఒత్తిడి వల్ల జరగవచ్చని అంచనా వేశారు. నీటి ఒత్తిడి ఫలితంగా భారత్ లాంటి దేశాల్లో విద్యుత్‌ కొరత, వ్యవసాయ దిగుబడుల తగ్గుదల, పారిశ్రామిక మందగమనం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. నీటి కొరత కారణంగా 2017-21ల మధ్య 8.2 టెరావాట్‌-హవర్‌ శక్తి ఉత్పత్తి తగ్గిందని, ఈ శక్తి 1.5 మిలియన్ల భారత కుటుంబాలకు 5 ఏండ్ల పాటు విద్యుత్‌ సరఫరా చేయవచ్చని తెలుపుతున్నారు. తీవ్ర నీటి ఒత్తిడి మూలంగా చెరుకు, గోధుమలు, రైస్‌, మొక్కజొన్నలు లాంటి పంటలకు తీవ్ర నష్టం కలుగుతున్నది. నీటి ఒత్తిడితో పాటు కరువులు, అకాల వరదల కారణాలతో 2010తో పోల్చితే 2050 నాటికి 56 శాతం ఆహార ధాన్యాలు అధికంగా అవసరమవుతాయి.

నీటి సంరక్షణ మార్గాలు:
నీటి సమర్థవంతమైన నిర్వహణతో నీటి కొరత కొంత వరకు తీరుతుందని ప్రపంచ దేశాలు గుర్తించాలి. నీటి నిర్వహణ పాలసీలు, వ్యవసాయరంగానికి పరిమితిలో నీటి వాడకం, నీటి వనరుల సమీకరణ, నీటి నిల్వలను పెంచడం, హరిత మౌళిక వనరుల కల్పన, చిత్తడి నేలల పునర్‌ స్థాపన, అడవుల పరిరక్షణ, పునరుత్పాదక శక్తి ఉత్పత్తులు/వినియోగాలను పెంచడం, జీవ వైవిధ్య పరిరక్షణలకు పెట్టుబడులు, నీటి వృధాను అరికట్టడం, ఇంకుడు గుంటలు/చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు, పట్టణాల్లో సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు, మురుగు నీటి శుద్ధితో తిరిగి వాడుకోవడం, తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడం, డ్రిప్‌/స్ప్రింక్లర్స్‌ వాడకం, నీటి ఒత్తిడి దుష్ప్రభావాలను అవగాహన పరచడం లాంటి చర్యలు నీటి ఒత్తిడిని తగ్గిస్తాయి.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
image0.jpeg

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *