*మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం చౌట్లపల్లి శివారులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి ఆకట్టుకున్నారు. కూలీలు పాటలు పాడగా వారితో ఆమె గొంతు కలిపారు. మహిళా కూలీలతో కలిసి నాటు వేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ముసురు కురుస్తుండగా.. వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.*





