స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమం
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.
జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఆర్డీఓ భుజంగరావు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, కళాశాల విద్యార్థులు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 2016లో “తెలంగాణకు హరితహారం” నిరూపణ.
230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం అయితే దానిని అధిగమించి ఇప్పటి వరకు 270 కోట్ల మొక్కలు నాటారు.
ఒక్కరోజు కోటి మొక్కలు నాటే “కోటి వృక్షార్చన” కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.
ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం.
ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుంది.
చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు నరికి ఉన్నాయి.
భారతదేశంలో ప్రతి మనిషికి సగటున కేవలం మూడు చెట్లు మాత్రమే ఉన్నాయి.
వాతావరణం బాగా ఉండాలంటే భూ విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి.
2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అడవుల విస్తీర్ణం 26 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కృషి, హరితహారం కార్యక్రమంలో ఇప్పుడు 33 శాతం పెరిగింది.
చెట్లు ఉంటే వర్షాలు పడతాయి.
చెట్లను నాటడం, సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
