Breaking News

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పింఛన్లు అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ

95 Views

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పింఛన్లు అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ

ప్రజలంతా సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం

పెరిగిన సంపద పేద ప్రజలకు పంచాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం

జిల్లాలో ( 15 మండలాలు, 5 మున్సిపాలిటీలలో) 1,38,135 మందికి పింఛన్లు అందజేస్తాం

కరీంనగర్ అసెంబ్లి నియోజక వర్గంలో 6433 మంది వికలాంగులకు నూతన పెన్షన్ 4016, 40మంది టేకేదార్లకు 2016 పించన్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
. 0 0 0 0
పేద ప్రజలు సంతోషంగా ఉండాలని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పింఛన్లు అమలవుతున్న రాష్ట్రం తెలంగాణా ఒక్కటేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ అసెంబ్లి నియోజక వర్గంలోని బీడి టేకేదారులకు నూతన పించన్లు మరియు వికలాంగుల ఆసరా పించన్ల పెంపు పంపిణి కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం ప్రజల మనస్సు నిండ, కడుపునిండా వచ్చే నవ్వులే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దీవెనలని అన్నారు. అన్ని అవయవాలు పనిచేసిన వక్రబుద్దితో ఉన్నవారే అసలైన దివ్యాంగులని, ఎటువంటి కల్మషం లేకపోయిన విదివశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారు దైవసమానులని, వారు సమాజంలో చులకన భావానికి గురికాకుండ, సగౌరవంతో బ్రతకాలని వికలాంగులను అక్కున చేర్చుకుని రూపాయలు 4016 లను, బీడి టేకే దారులకు రూపాయలు 2016 రూపాయల పించన్లను అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని 15 మండలాలు, 5 మున్సిపాలటీలలో 1,38,135 మందికి పించన్లను అందించగా, అందులో 23641 వికలాంగులు , 40 మంది బీడి టేకే దారులు ఉన్నారన్నారు. ఒక్క కరీంనగర్ అసేంబ్లి నియోజక వర్గ పరిదిలోనే 6433 మంది వికలాంగులకు రూపాయలు 4016 చోప్పున 2,58,34,928 రూపాయలను, మరియు 10 మంది బీడిటేకే దారులకు రూపాయలు 2016 చోప్పున 20,160 లను పించన్ల రూపంలో అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంపద పెరిగిందని పెరిగిన సంపదను పేదలకు పంచాలని లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు పరుస్తున్నారని అన్నారు. స్వతంత్య్రం వచ్చిన తరువాత కూడా తెలంగాణలొని సంపద ఎత్తుకుపోవడంతో సరిపడా నీళ్లు, కరెంటు లేక అరిగోసల పడ్డరోజులను గడిపామన్నారు. సరైన ఉపాది లేక ఉన్న ఊళ్లను వదిలి వలసలు పోయి బ్రతికే దుస్థితిలో తెలంగాణ ప్రాంతం ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి పూర్వం వికలాంగులను సమాజం, ప్రజాప్రతినిధులు చులకన బావంతో చూసే వారని, వారికి 50 రూపాయల నుండి 200 వరకు ఎటుచాలని పించను మాత్రమే ఇచ్చేవని తెలిపారు. కొత్తగా ఎవరికైన పించను కావాలంటే, ఎవరైన చనిపోతే వారిస్థానంలో కొత్తపించను ఇచ్చే స్థితి నెలకొందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవర్బావం తరువాత రాష్ట్రంలో పెరిగిన సంపద తిరిగి పేదలకే దక్కాలని రూపాయలు 2000 పించను అందించుకోవడం జరిగిందని అన్నారు. ఇటీవల వికలాంగుల పించనును 4016 లకు పెంచుకోవడం మాత్రమే కాకుండా జూలై మాసం నుండి బ్యాంకు ఖాతాల్లో పించను సోమ్మును జమచేయడం కూడా జరిగిందని తెలిపారు, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చివరగా కరీంనగర్ నియోజక వర్గంలోని బీడి టేకే దారులకు ప్రోసిడింగ్ లను, వికలాంగులకు రూపాయలు 2,58,34,928 ల చెక్కును అందజేశారు.

మేయర్ వై. సునీల్ రావు మాట్లాడుతూ, దివ్యాంగుల అలన పాలన అందించి వారు ఆదరింపబడాలనే దిశగా పించన్లను అందజేసే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గతంలో సరైన పించను దారులకు సరైన ఆదరణ ఉండేది కాదని, తెలంగాణ ఆవిర్బావం అనంతరం ప్రజల కష్టాలు దూరం చేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ డా.బి. గోపి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్డిఓ శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మదు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు యంపిపిలు తిప్పర్తి లక్ష్మయ్య, జట్పీటీసీలు, సర్పంచులు, కార్పోరేటర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ, కరీంనగర్ చే జారిచేయబడినది

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *