సమైక్య భావానికి ప్రతికయే..మొహరం
పీర్లపండుగ: మొహరం పండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారని ఎల్లారెడ్డిపేట పీర్ల ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ బాబా తెలిపారు ఈ పండుగ ఉత్సవాలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి. హాజరయ్యారు కార్యక్రమానికి వార్డు మెంబర్ పందిర్ల శ్రీనివాస్ గౌడ్ బాడ రమేశ్ ఇన్నారు.అనంతరం పండగ ప్రత్యేకత గురించి మాట్లాడారు షియ తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారన్నారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడిలో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు…(ఇది సమైక్య భావానికి ప్రతీక)..! ఇస్లాంలో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వరు, కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు ఉన్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. “ఊదు వేయందే పీరు లేవదు”. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.ఊదు
