Breaking News

కించపరిచిన నిందితుడిని అరెస్టు చేయాలి.

225 Views

మైనార్టీ మహిళను కించపరిచిన నిందితుడిని అరెస్టు చేయాలి.

పోలీస్ కమిషనర్ శ్వేతకు విన్నవించిన దళిత బహుజన,మైనారిటీ, విద్యార్థి సంఘాలు.

28న దుబ్బాకలో రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపు..

అక్టోబర్ 26

సిద్దిపేట జిల్లా  సామాజిక ప్రజా సేవకురాలు, మైనార్టీ మహిళను సోషల్ మీడియాలో కించపరిచిన బిజెపి కార్యకర్తను తక్షణమే అరెస్టు చేయాలని దళిత బహుజన, విద్యార్ధి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధిపేట పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వివిధ దళిత,విద్యార్థి సంఘాల నేతలు గుర్రాల శ్రీనివాస్ ,పి.శంకర్,ఎస్. శ్రీకాంత్ మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ఫేస్ బుక్ లో అనే పెట్టుకున్న వ్యక్తిగత ఫోటోను ఉద్దేశించి బీజేపి నాయకుడు కోత్తిండ్ల సత్యం ఎవరికి ద్రోహం చేద్దామనుకుంటున్నారు.

దేశానికా దేహానికా అంటూ ముస్లిం మహిళను కించపరిచడాని తెలిపారు.వెంటనే పోలీసు అధికారులు ముస్లిం మహిళను సోషల్ మీడియా మాధ్యమంలో వేధించిన కోత్తిండ్ల సత్యంను అరెస్ట్ చేయాలని కమిషనర్ కు విన్నవించారు. మైనార్టీ మహిళను కించపరిచిన బిజెపి నాయకుడి పై కేసు నమోదు చేసిన కూడా అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు.దీన్ని నిరసిస్తూ ఈనెల 28వ తేదీన దుబ్బాకలో ముస్లిం మైనార్టీ, దళిత బహుజన, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు  తెలిపారు.ఈ సమావేశానికి దుబ్బాక నియోజక వర్గంలో ఉన్న దళిత బహుజన, మైనారిటీ,బీసీ,విద్యార్థి, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో సిద్దిపేట జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు గుర్రాల శ్రీనివాస్,పి.శంకర్, మాలల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ కరికె శ్రీనివాస్,పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్, ఏకలవ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం రమేష్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు తుమ్మ శ్రీనివాస్, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్,

డిబిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ శేఖర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *