అక్రమ బియ్యం రవాణాపై విచారణ జరిపించాలి సురేందర్ రెడ్డి
కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 03
తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మరా డయించేందుకు మిల్లర్లకు ఇస్తుండగా రైస్ మిల్లర్లు అందిన కాడికి దోచుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి విమర్శించారు.
అక్రమ బియ్యం రవాణాపై విచారణ చేయాలని, బియ్యం రవాణా దారులపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేయాలని కోరుతూ మంగళవారం రోజున సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..కొందరు రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తూ బియ్యాన్ని తమిళనాడుకు తరలిస్తున్నారని రైస్ మిల్ అసోసియేషన్ కి చెందిన కొంతమంది బడా వ్యాపారులు ఈ యొక్క చీకటి దందాలు నడిపిస్తున్నారని దీన్ని నియంత్రించాల్సిన పౌరసరఫరాల అధికారులు సంబంధిత శాఖ మంత్రి గంగుల కమలాకర్, కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన ఆరోపించారు.
