మానవ వికృత చేష్టలకు మంగళం పాడేది ఎన్నడు ?
మానవ, కుటుంబ సంబంధాలలో పెను విషాదాలకు వ్యక్తిగత లోపాలే కారణం *వృత్తిని బద్ధత ,సామాజిక బాధ్యతల పైన కూడా పడుతున్న దుష్ప్రభావం . * పౌర ధర్మాన్ని మెరుగుపరుచుకోవడమే పరిష్కారం .
అక్షరాస్యత పెరిగిన, సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లిన,
ఆదర్శ మార్గాలు ఆకాశానికి నిచ్చెన వేసినా, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే స్థితికి చేరుకున్నా, కృత్రిమ వర్షాలు కురిపించినా, భయంకరమైన రోగాలకు మందులను చికిత్సను కనిపెట్టినా మనిషి ఆలోచన మార్పు ఇతరుల పట్ల తన వైఖరిని బట్టి తన వరకు ఆలోచించే పచ్చి స్వార్థపరత్వం మానవ హుందాతనాన్ని చేసే ధోరణిలో రాలేదు. మిగిలిన జీవరాసులకు లేనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌలభ్యాలు మాట, నవ్వు , ఆలోచన, వివేచన మనిషికి ఇచ్చినప్పటికీ వాటిని ఉపయోగించి ఇతరుల పట్ల వ్యవహరించే సమయంలో అత్యంత దారుణంగా నీచంగా దుర్మార్గంగా జీవించి ఉన్న సందర్భాలే ఎక్కువ .ఈ అనుభవాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కడో మూలన ఎవరితోనో ఇబ్బందులకు గురైన సందర్భాలను మనం గమనించవచ్చు.సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా పాలకవర్గాలను, రాజకీయ పార్టీలను, సామాజిక వ్యవస్థను, భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థను, అసమానతలు అంతరాలు దోపిడీ పీడనను వ్యతిరేకించలేదు ఖండిస్తూ తాను మాత్రం బాధ్యుడను కాను అన్నట్లు నటిస్తూ ఉంటారు. ఇంకా మరికొందరు తమకేమీ సంబంధం లేనట్లు, తన దాకా వస్తే ఆలోచన చేద్దాం అన్నట్లు, ఆమాత్రం తప్పులు తప్పకుండా ఉంటాయి విమర్శ అవసరమా ? వేల మైల్ల ప్రయాణమైన మొదటి అడుగుతోనే సత్యాన్ని అన్వయించుకుంటే వ్యవస్థ బాగుండాలన్నా, పాలకవర్గాలు ప్రజల కోసం పనిచేయాలన్నా అసమానతలు అంతరాలను తొలగించాలన్నా వ్యక్తిగతంగా మన బాధ్యత కూడా ఉన్నది అని గుర్తించకపోవడానికి ఆ వ్యవస్థ నీరు గారి పోవడానికి అభివృద్ధి కుంటు పడడానికి మరింత వెనుకబడి తన కోసం కారణం అవుతున్నది . కార్యకరణ సంబంధ సిద్ధాంత ప్రాతిపదికన ప్రతి నిబద్ధతగా ఆలోచనతో సమన్వయము చేసుకున్నప్పుడు, పౌర బాధ్యతలు నిర్వర్తించినప్పుడు, తోటి మనిషిని సాటి మనిషిగా చూచినప్పుడు , ప్రశ్నించే చోట మౌనంగా ఉండకుండా చైతన్యంగా మెలగినప్పుడు తప్పకుండా ఈ వ్యవస్థ బాగుపడుతుంది. మెరుగైన సమాజాన్ని చేరుకోవడం మరింత సులువు అవుతుంది.
రాజ్యాంగ మానవ విలువలను సమన్వయం చేసుకోవాలి:_
*****(*(***********************
బాధ్యత పౌరులను సక్రమంగా నిర్వర్తించకుండా నిత్యజీవితంలో వ్యక్తిగత సామాజిక బాధ్యతలను విశ్వసించకుండా వ్యవస్థ మనుగడకు ఆటంకాలు కల్పిస్తున్న వారు మనలో చాలా మంది ఉన్నారు .రోడ్డుకు ఆటంకాలు కలిగించడం, రోడ్డుమీదనే వ్యవహారాన్ని చక్కబెట్టడం, నిబంధనలు పాటించకుండా ఉన్నట్టుగానే నిర్మాణాలు చేయడం, సంబంధిత యంత్రాంగాన్ని ధిక్కరించి ఒంటెద్దు పోకడ పోవడం వంటి వాటిని మనం అనేకమంది సక్రమంగా చూడవచ్చు. పాటించకుండా పాలకులను ఇతర వర్గాలను ఎలా ప్రశ్నిస్తామో ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది .అదే సందర్భంలో తమకు తాము ప్రక్షాళన చేసుకోవడమే దీనికి పరిష్కారం . ఇక వృత్తిపరమైన నిబద్ధతను చాలామంది విస్మరించి వృత్తులు ప్రవృత్తులు విధినిర్వహణలో అనేక తప్పుడు పనులకు ఉద్యోగులైతే అవినీతి, ప్రజలు పీడించే దుష్ట సంప్రదాయాలకు ప్రజలు చేస్తున్న వారిని మనం అనేక మందిని చూడవచ్చు . ఇటీవల కాలంలో కొంతమంది అధికారుల సిబ్బంది హిం సించిన పాపానికి నిలువునా దహనమైన సందర్భాలను మనం ఉదరించవచ్చు . ప్రజల సొమ్మును వేతన రూపంలో అందుకుంటున్న ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు సిబ్బంది పోలీసు పౌర ఇతర అధికారులు అందరూ ప్రజలే కేంద్రంగా ప్రజల కోసం పనిచేయవలసిన సేవకులు మాత్రమే .కానీ పాలకులం ప్రభువులం అనుకున్నప్పుడు పొరపాటు. అవసరమైతే తమ వృత్తిరీత్యా సామాన్య ప్రజానీకానికి మరింత చేతనైతే సేవ చేయడానికి సౌలభ్యాలు కల్పించడానికి దగ్గరి దారిలో పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది
. ఆ వైపుగా ప్రయత్నం చేసి వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతను ప్రదర్శించడం ద్వారా ప్రజల పట్ల దేశం పట్ల ప్రాంతం పట్ల సేవా దృక్పథాన్ని కనపరచాలి.
కుటుంబ మానవ సంబంధాలలో గందరగోళాలు:-
****************************************
కుటుంబ విషయంలోనూ బంధుత్వంలోనూ చివరికి సమాజంలోనూ తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేని అహంకారము మనిషిని నిలువునా దహించి వేస్తున్నది . అధికార దాహం , ఆదిపత్య ధోరణి, స్వార్థ ప్రయోజనాలు, డబ్బు కోసం చెలగాటం, పేదల పట్ల చిన్నచూపు, మానవత్వం ప్రేమ జాలి లేనటువంటి కపట నీతి కుటుంబంలోనైతేనేమి సమాజంలోనైతేనేమి ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు మనం అందరం గమనించవచ్చు. చదువు సంస్కారం కారణంగా మనిషి ప్రవర్తనలో ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు . అనుకరణ , విజ్ఞుల శ్వాస , విద్య , ఉపాధ్యాయులు, సభలు సమావేశాల ద్వారా మానవ సంస్కారము సాధ్యమవుతుంది. కానీ ఇప్పటికి సంస్కరించుకోలేక, మూర్ఖపు ఆలోచనలను విసర్జించలేక, ఇతరులకు హానిచేసి అసూయ ద్వేషాలను ప్రదర్శించి కుటుంబాలలో మానవ సమూహంలో చిచ్చు పెట్టి సమాజానికి ద్రోహం చేసే చీడపురుగులను కోట్లాదిమందిని మనం చూడవచ్చు. బాధ్యతలకు నిలబడ్డప్పుడే హక్కులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
కుటుంబ సంబంధాలకు గండి కొట్టి ప్రేమానురాగాలను వర్ధిల్లకుండా చేసి పచ్చి గడ్డి వేస్తే మండే సూర్యుని వలె ఘర్షణకు కాలుదువ్వే జనాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. వీళ్లను పౌర ధర్మాలు మానవ ధర్మాలు రాజ్యాంగ ధర్మాలు ఏమీ లేనటువంటి మూర్ఖులుగా వెలివేయవలసిన అవసరం చాలా ఉంది .అదే సందర్భంలో దోపిడీకి దొంగతనాలకు దాడులకు పాల్పడి ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వారు నేరపూరిత మనస్తత్వంతో నేరాలకు భిన్నమైన చట్టసభల్లోకి కూడా పరిగెత్తుతున్న వాళ్లను చూసినప్పుడు మన సమాజం ఎటువైపు పయనిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
పరిష్కార మార్గం ఏమిటి* చైతన్యం- పోరాటక్రమం:-
**************************(**
దేశ పౌరులుగా మరింత మెరుగైన సమాజం వైపు ఆలోచించవలసిన బాధ్యతను ఒకవైపు కొనసాగిస్తూనే ప్రస్తుతమున్న వ్యవస్థను కాపాడుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని మార్చుకుంటూ వెళ్ళవలసిన అవసరం ప్రతి పౌరునికి ఉంటుంది. రాజ్యాంగ ఫలాలను క్రింది స్థాయి వరకు తీసుకువెళ్లాలన్నా, దోపిడీ పీడినకు గురికాకుండా హక్కులను రక్షించుకోవాలన్న ఉమ్మడి కార్యాచరణ పోరాట స్ఫూర్తిని ప్రశ్నించే తత్వము సమైక్య ఆలోచన ధోరణి చాలా అవసరం .వ్యవస్థను ఆ వైపుగా తీర్చిదిద్దవలసిన అవసరం కూడా చాలా ఉంది. రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలించే పాలకులు తప్పటడుగులు వేస్తే, రాజ్యాంగాన్ని అమలు చేసే విషయంలో ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తే, పెట్టుబడిదారులకు వంత పాడి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కోట్లాది ప్రజానీకం అనాధలు యాచకుల హెచ్చరికలు బానిసలు బిచ్చగాళ్ళుగా మారిపోతున్న దయనీయంగా మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం .చట్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా మనకు ఇచ్చిన ఓటు హక్కును ఉపయోగించి పాలకులుగా మారే ఓటును అమ్ముకుంటూ, రాజకీయ ప్రలోభాలకు బలి అవుతూ , అస్తిత్వాన్ని కోల్పోతూ, బానిసలుగా మారిపోతున్న తరుణములో ఓటు హక్కు ఎంతటి ఆయుధమో ఒక్కసారి మన0 చేసుకోవాలి. మనలను నిత్యం పీడిస్తూ రాజ్యాధికారానికి దూరంగా వెలివేస్తున్నటువంటి పాలకవర్గాల కుట్రలను చేదించడానికి ఒక్కటై మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే పాలకవర్గాలు కళ్ళు తెరుస్తాయి, తలవంచి ప్రజల ముందు మోకరిల్లుతాయి, ఎవరి వాటా వారికి అందజేస్తుంది. ఆ వైపుగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక విశాలమైన ప్రాతిపదిక మీద చర్చ సాగుతున్నది ముఖ్యంగా అధికారానికి దూరమైన బీసీ వర్గాలలో పోరుబాట నిరంతరము ప్రజ్వలిస్తూనే ఉన్నది .అదే సందర్భంలో బాధ్యతాయుతమైన పౌరులు ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం, పాలకుల కర్తవ్యాలను గుర్తింపజేయడం, ఏకపక్ష విధానాలను ప్రశ్నించడం, చట్ట సభలను సక్రమంగా వినియోగించేలా ఒత్తిడి చేయడం వంటి కార్యక్రమాలను బాధ్యతలను సమాజం విపక్షాలతో కలిసి పోరాడినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుంది . వ్యక్తిగతంగాను సామూహికంగా బాధ్యతలతో పాటు వృత్తి నిబద్ధతకు జాతీయ పరివర్తనకు కూడా ప్రతి వ్యక్తి కంకణం కట్టుకున్నప్పుడు మాత్రమే సుదూరంగా ఉన్న మన ఆశయమైన సామ్యవాదం సమానత్వం సౌబ్రాతృత్వం సాధ్యమవుతుంది .అప్పుడే పరపీడన నుండి స్వేచ్ఛ వాయువులు పీల్చి వజ్రోత్సవాలు జరుపుకునే మన భారతదేశానికి ఒక అర్థం . ఈ అవగాహన ప్రతి పౌరునికి ప్రతి విద్యార్థికి సభ్య సమాజానికి చెవిలో జోరీగ లాగా వినిపించినప్పుడు మాత్రమే తమ తప్పులు తెలుసుకుంటారు, బాధ్యతలు గుర్తిస్తారు, చెడు పోకడలకు స్వస్తి పలుకుతారు, వివక్షతలు అణచివేతలను నిలదీస్తారు. . తద్వారా సమ సమాజాన్ని సార్వభౌమాధికారాన్ని తనివి తీరా అనుభవించవచ్చు . బాధ్యతలు నిర్వర్తించకుండా , హక్కులతో పోరాడకుండా , సందర్భోచితంగా ప్రశ్నించకుండా,
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
