ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం …. టి.ఎస్. రెడ్ కో జిల్లా మేనేజర్. —————————- పెద్దపల్లి, ఆగస్టు -26: —————- ———- పి.పి.పి. పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టి.ఎస్.రెడ్ కో (TSREDCO) కరీంనగర్ జిల్లా మేనేజర్ వి. పరమాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కొరకు పి.పి.పి. పద్ధతిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ లో సుమారు 72, పెద్దపల్లి లో 30, జగిత్యాలలో 14, రాజన్న సిరిసిల్లలో 12 మొత్తం సుమారు 128 అనువైన స్థలాలను గుర్తించడం జరిగింది, టి.ఎస్. కో ఎంపిక చేయబడ్డ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లకు 10 సంవత్సరాల వరకు పేరింగ్ ఆధారితంగా ఈ నంబర్ కేటాయిస్తారనీ, ఈ స్థలంలో ఎంపిక చేయబడ్డ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు గైడ్‌లైన్‌గా ఛార్జింగ్ స్టేషన్‌ను సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకొని పదేళ్లపాటు వాటిని నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు.
ఆసక్తి గల వాళ్లు టి.ఎస్. రెడ్ కో వెబ్‌సైట్ www.tsrdco.telangana.gov.in గాని,టి.ఎస్.ఆర్.ఈ.డి. సి.ఓ. ప్రధాన దరఖాస్తుల ఆసక్తివ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంటరెస్ట్)లో పాల్గొనాలని, పూర్తిచేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 4 నాడు ప్రత్యక్షంగా తీసుకొని టి.ఎస్.ఆర్.ఐ.డి.సి. ఓ. ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ వచ్చి కేటాయింపు ప్రక్రియలో పాల్గొనాలని టి.ఎస్. రెడ్ కో జిల్లా మేనేజర్ ప్రకటనలో తెలిపారు.
————————————————- —–
జిల్లా పౌర సంబంధిత అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయబడింది.
